![]() |
![]() |
(1).webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఏ దేవి వరమో నీవు Ye Devi Varamo Neevu. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ 37 లో..... రాజారావు దగ్గరికి అంజలి వస్తుంది. తాతయ్య మీరు నాకు కావాలనే నిజం చెప్పడం లేదా అని అడుగుతుంది. ఒక్క క్షణం పాటు అంజలికి నిజం తెలిసిపోయిందేమోనని రాజారావు టెన్షన్ పడుతాడు. లేదమ్మా ఒక్క రోజు టైమ్ ఇవ్వు నీకు అన్ని విషయాలు చెప్తానని రాజారావు అంటాడు. ఆ తర్వాత అంజలి పడుకున్నాక రత్నం వచ్చి తన చేతికి ఉన్న పుట్టు మచ్చ చూస్తుంది.
మరొకవైపు గీతాంజలి వాళ్ళ పిల్లలు గదిని నీట్ గా ఉంచుకోలేదని గీతాంజలి కోప్పడుతుంది.ఆ తర్వాత గీతాంజలి ఇంటికి రాజారావు వస్తాడు. గుమ్మం దగ్గరే నిల్చొని ఎందుకు వచ్చారో చెప్పండి అని గీత కోపంగా అనేసరికి రాజారావు వెనక్కి తిరిగి వస్తుంటాడు. అప్పుడే గీతాంజలి వచ్చి నేను మీ ఇంటికి రానని శపథం చేసాను కానీ మిమ్మల్ని రావద్దని అన్లేదు కదా అని అంటుంది. నాన్న అంటూ గీతాంజలి ఎమోషనల్ అవుతుంది. రాజారావు లోపలికి వెళ్తాడు. అందరిని అక్కడ నుంచి వెళ్ళమని చెప్తాడు. అంజలి గురించి నిజం చెప్పపోతుంటే రాజారావుని బ్లాక్మెయిల్ చేసే వ్యక్తి ఫోన్ చేసి నువ్వు ఇప్పుడు అంజలి గీతాంజలి కూతురు అని మీ కూతురికి చెప్తే మీ అల్లుడికి నేను చెప్తానని బ్లాక్మెయిల్ చేస్తాడు.
దాంతో రాజారావు చెప్పకుండా వెళ్ళిపోతాడు. మరొకవైపు మనీష్ డల్ గా ఉంటే అంజలి వచ్చి.. ఏంటి ఈ రోజు ఆఫీస్ కి వెళ్లలేదా అని అడుగుతుంది. మా అత్త ఆఫీస్ కదా ఎప్పుడైనా వెళ్లొచ్చు.. ఎప్పుడైనా రావొచ్చు అని అంటాడు. అలా ఎప్పుడైనా వెళ్లి ఎప్పుడైనా వచ్చినందుకు తీసేసారా అని అంజలి అంటుంది. అలా మనీష్ ని అంజలి నవ్వేలా చేస్తుంది. మరొకవైపు రత్నం ఒక చెక్ తీసుకొని రాజారావు దగ్గరకు వచ్చి.. ఇదేంటి నా అనుమానం నిజమేనా అని అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |